![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(Karthika Deepam2)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -639 లో..... కార్తీక్, దీప పెళ్లి రోజున దీపని పడెయ్యడానికి గుమ్మం ముందు జ్యోత్స్న నూనె పోస్తుంది. మొదట కార్తీక్ వస్తాడు. ఆ తర్వాత దీప వస్తుంటే.. కాలు జారీ పడిపోతుంటే జ్యోత్స్న పట్టుకుంటుంది. అయ్యో దీప జాగ్రత్త అని ఏం తెలియనట్లు యాక్టింగ్ చేస్తుంది. జ్యోత్స్న గనుక పట్టుకోకపోయుంటే దీపకి దెబ్బ తగిలేదని జ్యోత్స్న గురించి శివన్నారాయణ పాజిటివ్ గా మాట్లాడతాడు. ప్రతీసారి నేను పట్టుకోలేను కదా దీప జాగ్రత్తగా ఉండాలి కదా అని జ్యోత్స్న అంటుంది.
ఆ తర్వాత జ్యోత్స్న పక్కకి వెళ్లి నా ప్లాన్ ఎవరికి అర్థం కాదు.. నేనే నూనె పోసి తనని అలా చేసాను కానీ అందరి దృష్టిలో నేను మంచిదాన్ని అని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి అది విని పిల్లి కళ్ళు మూసుకుని ఎన్ని రోజులు పాలు తాగగలదని కార్తీక్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత బావ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను.. అలాగని నేను నెంబర్లు లెక్కేస్తూ ఉండలేను. నా స్థానం ఎప్పుడు నెంబర్ వన్ గానే ఉండాలని జ్యోత్స్న అంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి చెంపపగులుతుందంటూ వార్నింగ్ ఇస్తుంది. మనవడా నువ్వు దీప దగ్గరికి వెళ్లు.. దీని సంగతి నేను చెప్తానని పారిజాతం అంటుంది. ఆ తర్వాత దీప కిచెన్ లో జ్యూస్ చేస్తుంది. కార్తీక్ వెళ్తాడు. వెనకాలే పారిజాతం వచ్చి.. ఈ రోజు మీరు ఇద్దరు దిష్టి తీసుకోండి చాలా బాగున్నారని పారిజాతం అనగానే.. ఈ రోజు మా పెళ్లి రోజు అని కార్తీక్ చెప్తాడు. ఇద్దరిని పారిజాతం హాల్లోకి తీసుకొని వెళ్లి అందరికి విషయం చెప్తుంది.
అందరు విష్ చేస్తారు. అందరి దగ్గర కార్తీక్, దీప ఆశీర్వాదం తీసుకుంటారు. సరే ఇక మేం వెళ్తామని కార్తీక్, దీప వెళ్తుంటే ఎక్కడికి అని జ్యోత్స్న చీరకట్టులో పైనుండి కిందకి వస్తుంది. ఈ రోజు వాళ్ళ పెళ్లిరోజు వాళ్ళని వెళ్లనివ్వు అని దశరథ్ అంటాడు. అవునా నాకు తెలియదని విష్ చేస్తుంది. నాకు తెలియదు కదా నేను బావని తీసుకొని గుడికి వెళ్ళాలని అనుకున్నా పెళ్లి కావాలంటే ఏదో పూజ చెయ్యాలని పంతులు చెప్పారు. నా పెళ్లి బాధ్యత బావ తీసుకున్నాడు కదా తనని తీసుకొని వెళ్ళాలనుకున్నానని జ్యోత్స్న అంటుంది. కావాలంటే మీ అమ్మని తీసుకొని వెళ్ళమని దశరథ్ అనగానే నేను బావతో వెళ్తానని జ్యోత్స్న అంటుంది. వద్దని పారిజాతం అంటుంది. వెళ్లనివ్వండి ఎంతసేపట్లో వస్తారని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |